అడిషనల్ ఎస్పీగా చందనదీప్తి
తాండూరు:
తాండూరు ఏఎస్పీ చందనదీప్తికి పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెlనిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ (ఓఎస్డీ)గా నియమితులయ్యారు. తాండూరు ఏఎస్పీగా 2015 ఫిబ్రవరిలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర కాలం పాటు ఇక్కడ పనిచేసిన ఆమె.. షీ టీంల ద్వారా మహిళలకు భద్రత కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేశారు. రెండు రోజుల్లో ఆమె నిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు.