విజయసంకేతం చూపుతున్న మంత్రి హరీశ్‌రావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ టీకే శ్రీదేవి
ఎన్ని కుట్రలు పన్నినా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోలేక పోయాయని, సుప్రీం కోర్టులో కూడా తెలంగాణ వాదనలే నిజమయ్యాయని, ఇకనుంచి ఈ పథకాన్ని జెట్‌స్పీడ్‌తో పూర్తిచేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టంచేశారు.
-
భూసేకరణకు రైతులు సహకరించాలి
-
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా
-
మార్చడమే సీఎం కేసీఆర్ ధ్యేయం
-
భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు
-
ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
కొత్తకోట: ఎన్ని కుట్రలు పన్నినా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోలేక పోయాయని, సుప్రీం కోర్టులో కూడా తెలంగాణ వాదనలే నిజమయ్యాయని, ఇకనుంచి ఈ పథకాన్ని జెట్‌స్పీడ్‌తో పూర్తిచేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టంచేశారు. గురువారం ఆయన జిల్లాలోని భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి సాగునీటిని విడుదల చేశారు. భీమా ఫేజ్–2లోని రెండవ లిఫ్ట్ ద్వారా 64వేల ఎకరాలకు నీళ్లను విడుదల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలమూరు ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఇక్కడి నుంచే ఉద్యమాన్ని ఉధతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. పాలమూరుకే తొలిఫలాలు అందాలనే సంకల్పంతో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని గుర్తుచేశారు.
ఇప్పటివరకు 12వేల ఎకరాల భూమిని సేకరించారని, త్వరలోనే మరో 8వేల ఎకరాలను సేకరిస్తామని, అందుకు రైతులు సహకరించాలని కోరారు. జూరాల నిర్మాణాన్ని 30 ఏళ్లకు గాని పూర్తిచేయలేకపోయారని కాంగ్రెస్, టీడీపీలను విమర్శించారు. వీరు అధికారంలో ఉన్నాళ్లు జిల్లాలో రైతులు కూలీలుగా మారి వలసబాట పట్టారని గుర్తుచేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని, వచ్చే ఖరీఫ్ నాటికి 8లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఎస్.నిరంజన్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.