హైదరాబాద్: ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తారా.. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్లో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీలో ఇసుక అమ్మకాలలో రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరిగిందని బొత్స ఆరోపించారు. ఇసుక అమ్మకాలతో రూ.3 వేల కోట్లు ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు కేవలం రూ.850 కోట్ల లాభం మాత్రమే వచ్చిందని బాబు పేర్కొంటున్నారని చెప్పారు. అదేవిధంగా విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 40 క్యూబిక్ మీటర్ ఇసుక ధరను టీడీపీ ప్రభుత్వం రూ.550కి పెంచిందని గుర్తుచేశారు. ఈ లెక్కన ప్రభుత్వానికి ఎంతకాదన్నా రూ.1650 కోట్ల ఆదాయం వస్తుందని బొత్స సత్యనారాయణ వివరించారు.
'ఇసుక అమ్మకాలలో వెయ్యి కోట్ల దోపిడీ'
Published Thu, Dec 3 2015 3:25 PM | Last Updated on Sat, Jul 28 2018 6:51 PM
Advertisement
Advertisement