సరైన ధ్రువపత్రాలు లేకుండా గ్రానైట్ రాయిని తరలిస్తున్న 18 లారీలను అధికారులు పట్టుకున్నారు.
సరైన ధ్రువపత్రాలు లేకుండా గ్రానైట్ రాయిని తరలిస్తున్న 18 లారీలను అధికారులు పట్టుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్‌లోని నాయుడు పెట్రోల్ బంక్ వద్ద గురువారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లారీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, అధిక మొత్తంలో గ్రానైట్‌ను తరలిస్తున్నట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి 18 లారీలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. సోదాల్లో డీటీఓ రంగారావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెంకటరమణారెడ్డి, ఎఫ్‌ఆర్‌వో అహ్మద్‌మియా, ఏసీటీవో సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.