నెంబర్ 1 విశ్వాసఘాతకుడు ఆయనే: మంద కృష్ణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెంబర్ 1 విశ్వాస ఘాతకుడని, 2014లో కాపులు తెలుగుదేశం పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటిస్తే.. వాళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. తానెప్పుడూ కాపులకు హామీ ఇవ్వలేదు గానీ, ఎన్నికల్లో మొదటిసారి హామీ ఇచ్చాను కాబట్టి మాట నిలబెట్టుకుంటా అన్నాడని.. కానీ గెలిచిన తర్వాత అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచినా ఎలాంటి స్పందన లేదని ఆయన అన్నారు.
కాపులకు రిజర్వేషన్ సాధన కోసం ముద్రగడ పద్మనాభం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరాహార దీక్ష చేస్తుంటే, ఆయనకు మద్దతుగా బయటి వాళ్లు ఎవరూ తూర్పుగోదావరి జిల్లాకు రాకుండా ఆంక్షలు విధించడం దారుణమని మంద కృష్ణ మాదిగ అన్నారు. అలా ఆంక్షలు విధించడం పౌరహక్కులను కాలరాయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన చెప్పారు. కాపులను మభ్యపెట్టేందుకే చంద్రబాబు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని మందకృష్ణ మండిపడ్డారు.