
పురంధేశ్వరి కాంగ్రెస్ కోవర్టు: వర్ల
బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అవగాహన లేమితోనే సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత, రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు.
విజయవాడ(గుణదల): బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అవగాహన లేమితోనే సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత, రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి ఇంకా కాంగ్రెస్ కోవర్టుగా ఎన్‌డీఏలో పనిచేస్తున్నారని ఆరోపించారు.