
పోలవరంపై బీజేపీ నేతల కీలక వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్ట్పై బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.
రాజమండ్రి: పోలవరం ప్రాజెక్ట్పై బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్పై అనేక సందేహాలున్నాయని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
ఈ సందేహాలను తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పురందేశ్వరి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని విశ్వాసంలోకి తీసుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాతే కేంద్రం స్పందిస్తుందని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమా భారతి పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. డ్యామ్ ఎత్తు పెంచేదిలేదని అన్నారు.