ప్రాజెక్టుల పేరిట దోచుకున్న కాంగ్రెస్: తుమ్మల | Congress has stolen the name of the project: Thummala | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల పేరిట దోచుకున్న కాంగ్రెస్: తుమ్మల

Published Thu, Apr 7 2016 3:49 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Congress has stolen the name of the project: Thummala

రాయికల్/మెట్‌పల్లి: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు తమ పదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పేరిట రూ. లక్షల కోట్లు దోచుకున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం బోర్నపెల్లి వద్ద రూ.70 కోట్ల వ్యయంతో గోదావరిపై నిర్మించే బ్రిడ్జి పనులకు బుధవారం మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కల్వకుంట్ల కవితతో కలసి తుమ్మల భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను సస్యశ్యామలం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌పై కాం గ్రెస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం 2.7 శాతంగా ఉంటే ప్రస్తుతం అది 3.1శాతానికి పెరిగిందని చెప్పారు. రూ.40 వేల కోట్లతో అన్ని జిల్లా కేంద్రాలకు జాతీయ రహదారులను కలిపేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement