హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలని శాసనమండలి కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై పొంగులేటి పలు ప్రశ్నలను సంధించారు. ఆయన ఏమన్నారంటే..
- మావోయిస్టుల ఎజెండాను అమలుచేస్తామని చెప్పి, ఎన్‌కౌంటర్ల పేరిట తెలంగాణ యువతను కాల్చిచంపుతున్నారు
- రాజకీయ వికృత క్రీడకోసం వరంగల్‌కు ఉప ఎన్నిక తెచ్చారు
- ఇచ్చిన హామీలను మరిచిపోయి, రోజుకో కొత్త ప్రకటనతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు
- రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకుండా, రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్నారు
- తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తామని, భూమిలేని దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామన్నారు
- అధికారంలోకి వస్తే కేజీ టు పీజీదాకా ఉచిత నిర్బంధ విద్యను అమలుచేస్తామని, కుల రహిత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుచేస్తామని హామీని ఇచ్చి అమలుచేయలేదు.
టీఆర్‌ఎస్‌కు వరంగల్ ఉప ఎన్నికలో తగినవిధంగా బుద్దిచెప్పాలని పొంగులేటి ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడానికి ఎన్నో త్యాగాలు చేసిన కాంగ్రెస్‌పార్టీని గెలిపించాల్సిన బాధ్యత వరంగల్ ఓటర్లపై ఉందన్నారు.