టీడీపీ కార్పొరేటర్, ఆమె భర్తపై కేసు పెట్టాలి
ఏలూరు సెంట్రల్ : పెద్ద కృష్ణ హత్య కేసులో పోలీసులు అసలు నిందితులను వదిలిపెట్టి వేరేవారిపై కేసులు పెడుతున్నారని నిరసిస్తూ మృతుని బంధువులు గురువారం రాత్రి టూటౌన్ పోలీస్‌స్టేçÙన్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఏలూరు సెంట్రల్ : పెద్ద కృష్ణ హత్య కేసులో పోలీసులు అసలు నిందితులను వదిలిపెట్టి వేరేవారిపై కేసులు పెడుతున్నారని నిరసిస్తూ మృతుని బంధువులు గురువారం రాత్రి టూటౌన్ పోలీస్‌స్టేçÙన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి, ఆమె భర్త సురేషే నిందితులని వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో టూటౌన్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. గంటకుపైగా ఆందోళన చేయడంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఆధిపత్యం కోసమే కార్పొరేటర్ భర్త తన అన్నను చంపారని మృతుని సోదరుడు చిన్ని కృష్ణ ఆరోపించారు. తమను హత్య చేయడానికి యత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పడంతో తాను హైదరాబాద్ వెళ్లానని, తన అన్నను సురేష్ అతని వర్గం పొట్టన పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో తనను హత్య చేయడానికి యత్నించారని, తీవ్ర గాయాలై 47 కుట్లు పడినా తాను బతికి బయటపడ్డానని చెప్పారు. తన సోదరుడిని తీసుకువెళ్లి హత్య చేయడానికి కారణమైన వారిని సాక్షిగా చూపించారని, డీఎస్పీ ఎదుట లొంగిపోయిన ముగ్గురూ గంజాయి తాగేవారని, వారిని ఈ కేసులో చూపించి పోలీసులు చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఏలూరు డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు, ఎస్పీ డీఎస్పీ భాస్కర్ ఘటనాస్థలానికి వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఘటనకు ప్రత్యక్ష సాక్షులని మృతుని బంధువులు కొందరిని చూపించడంతో వారి నుంచి మరో ఫిర్యాదును పోలీç Üులు తీసుకున్నారు. కార్పొరేటర్, ఆమె భర్తపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీలు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిం చా రు. ఆందోళనలో తెలుగుదేశం కార్పొరేటర్ కరణం లోకేష్ పాల్గొనడం విశేషం.