ఒకటి నుంచి ‘దేవీచౌక్’ శరన్నవరాత్ర ఉత్సవాలు
ఒకటి నుంచి ‘దేవీచౌక్’ శరన్నవరాత్ర ఉత్సవాలు
Published Sat, Sep 24 2016 11:11 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
రాజమహేంద్రవరం కల్చరల్ :
శ్రీదేవీ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాజమహేంద్రవరం దేవీచౌక్ అమ్మవారి 83వ శరన్నవరాత్ర ఉత్సవాలు ప్రారంభమవుతాయని సమితి అధ్యక్షుడు తోలేటి ధనరాజు తెలిపారు. శ్రీదేవీ కల్యాణ మండపంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి 12.06 గంటలకు అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక వేదికపై ప్రతిషి్ఠస్తామన్నారు. ఒకటో తేదీ ఉదయం 8.48 గంటలకు కలశస్థాపన పూజ జరుగుతుందన్నారు. రెండో తేదీ ఉదయం 108 మంది దంపతులచేత సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తామన్నారు. 12న అన్నసమారాధనతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. రోజూ అమ్మవారిని ఒక్కో అవతారంలో అలంకరిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తామన్నారు.
Advertisement
Advertisement