గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా తూర్పుమండల డీఎస్పీ కె.రమేష్‌బాబు తెలిపారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా తూర్పుమండల డీఎస్పీ కె.రమేష్‌బాబు తెలిపారు. ఆదివారం బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో నిందితుల అరెస్టు చూపించి విలేకరులకు వివరాలను వెల్లడించారు.
గోకవరం మండలం తిరుమలాయపాలెంకు గ్రామానికి చెందిన ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉంటున్న డ్రైవర్ పిన్నమరెడ్డి కొండలరావు, రాజమహేంద్రవరం లలితానగర్‌కు చెందిన మరో డ్రైవర్ మీసాల సతీష్, గంజాయికమీషన్‌ఏజెంట్లు యానాం దరియాలతిప్ప ప్రాంతానికి చెందిన యాళ్ళలోవరాజు,రాజాగనగరం మండలం కలవచర్ల ప్రాంతానికి చెందిన వల్లేపల్లిరామకృష్ణ లు కలిసి వేన్‌లో ఏలేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి గంజాయిని వరంగల్‌కు తరలిస్తున్నారు.
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణకు అందించిన సమాచారం మేరకు స్పెషల్‌బ్రాంచి డిఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 05.00గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటుగా వచ్చిన వేన్‌ను పట్టుకున్నారు. వాహనాన్ని సోదా చేయగా.. ఖాళీగా కనిపించింది. అయితే.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో గంజాయి దాచారు. ఇది గమనించిన అధికారులు రహస్య అరలో తనిఖీ చేయగా.. 24మూటలు గంజాయి దొరికింది.
దీంతో వాహనంలోని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో తరలిస్తున్న 603కిలోల గంజాయిని, మూడుసెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లను విచారం చేయగా.. గంజాయి అక్రమ రవాణలో మరో ముగ్గురి హస్తం ఉదని తేలింది. దీంతో డ్రైవర్లు పిన్నమరెడ్డి కొండలరావు, మీసాలసతీష్‌లతో పాటు.. యాళ్ళలోవరాజు, వల్లేపల్లిరామకృష్ణలను శనివారం సాయంత్రం అరెస్టు చేశారు.
అయితే కేసులో కీలక సూత్రధారి ఎల్లా భాస్కరరావును అరెస్టు చేయాల్సి ఉందని డిఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. గంజాయి విలువ సుమారు రూ.30.15లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.