కృష్ణా పుష్కరాల సందర్భంగా పురోహితులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా పురోహితులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం ఆంక్షలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. పిండ ప్రదానాలు ఎక్కడైనా నిర్వహించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఏపీ సర్కార్ పురోహితులపై ఆంక్షలు విధించడంతో ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.