చింతూరు కేంద్రంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ను ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాజమండ్రి: చింతూరు కేంద్రంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ను ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఉన్న చింతూరు సహా వీఆర్‌పురం, కూనవరంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాక మండలాలను కలిపి నూతన ఐటీడీఏ కిందకు వస్తాయి. ఈ మేరకు సర్కారు జీవో-96ను విడుదల చేసింది. అధికార యంత్రాంగం సమీపంలోకి రావటంతో ఆయా మండలాల్లోని గిరిజనుల ఇబ్బందులు తీరనున్నాయి.