
కరవులోనూ ఎన్నికలా?
ఆనవాయితీని మరిచిన టీఆర్‌ఎస్: జానారెడ్డి
మనూరు: కరువు రోజుల్లో సైతం ఉప ఎన్నికలు నిర్వహించడం టీఆర్‌ఎస్‌కే చెల్లిందని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా మనూరులో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మరణించిన చోట ఆనవాయితీగా వారి కుటుంబీకులకే అవకాశం కల్పించే సంప్రదాయాన్ని టీఆర్‌ఎస్ ఉల్లంఘిస్తోందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు ఛాయలు నెలకొన్నాయని, రైతులు, ప్రజల బాగోగులు చూడాల్సిన సమయంలో ప్రభుత్వం వారిని ఎన్నికల మైకంలో ఉంచడం దారుణమన్నారు.