దళిత జీవన ప్రతిబింబాలు కన్నడ కథలు
దళిత జీవన ప్రతిబింబాలు కన్నడ కథలు
Published Sun, Sep 25 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
కర్నూలు (కల్చరల్): ప్రముఖ రచయిత రంగనాథ రామచంద్రరావు రచించిన కన్నడ కథలు దళిత జీవన ప్రతిబింబాలుగా నిలిచిపోతాయని ప్రసిద్ధ కథా రచయిత సింగమనేని నారాయణ తెలిపారు. స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన ‘కన్నడ దళిత కథలు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కథా సంకలనం భారతీయ సామాజిక దర్శనానికి దోహద పడుతుందన్నారు. కథారచయిత రంగనాథరామచంద్రరావు బాధ్యత కల్గిన రచయితగా అణగారిన వర్గాల బాధలను అక్షరీకరించడం అభినందనీయమన్నారు. ఈ సంకలనంలోని ప్రతి కథలో కన్నడ దళితుల కడగండ్లను చిత్రీకరించారన్నారు. రచయితను ఆయన సాహిత్య సాంస్కృతిక వారధిగా అభివర్ణించారు.
సభలో పాల్గొన్న సిల్వర్ జూబ్లీ కళాశాల తెలుగు శాఖ అ«ధ్యక్షుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. దళిత కథలు పాఠకుల మనసును కలిగించి పాఠకులను కర్తవ్యోన్ముఖులు చేస్తాయన్నారు. సంకలనంలోని గొడ్డుకాఫీ కథలో దళిత బాలుని జీవిత హదయ విదారకంగా చిత్రించి రచయిత అణగారిన జీవిత చిత్రాన్ని దర్శింపజేశారన్నారు. దేశ వ్యాప్తంగా దళితులపై అగ్రవర్ణాల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రంగనా«థరామచంద్ర రావు దళిత కథలను పాఠకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమని సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అన్నారు. సాహితీ స్రవంతి సిల్వర్‌జూబ్లీ కళాశాల విద్యార్థులో సామితీ సభ నిర్వహించి సమాజంలోని బడుగు జీవుల కథల గురించి వారికి తెలియజేయడం హర్షణీయమని కథా రచయిత ఇనాయతుల్లా అన్నారు. అనంతరం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రచయిత రంగనాధరామచంద్ర రావుకు ఘనసన్మానం చేశారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కెంగార మోహన్, రచయిత్రి నాగమణి, రచయితలు వియోగి, ఎస్డీవీ అజీజ్, సిల్వర్ జూబ్లీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డా.దండెబోయిన పార్వతి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement