కాపు నేతలతో ప్రభుత్వం చర్చించాల్సిందే: పవన్ | kapula reservation issue in tdp manifesto: pawan kalyan | Sakshi
Sakshi News home page

కాపు నేతలతో ప్రభుత్వం చర్చించాల్సిందే: పవన్

Published Mon, Feb 8 2016 1:55 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

కాపు నేతలతో ప్రభుత్వం చర్చించాల్సిందే: పవన్ - Sakshi

కాపు నేతలతో ప్రభుత్వం చర్చించాల్సిందే: పవన్

కాపు రిజర్వేషన్లపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కాపుల రిజర్వేషన్ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారని గుర్తు చేసిన ఆయన కాపు నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలంటూ ట్వీట్ చేశారు.

హైదరాబాద్: కాపు రిజర్వేషన్లపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కాపుల రిజర్వేషన్ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారని గుర్తు చేసిన ఆయన కాపు నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలంటూ ట్వీట్ చేశారు. ఎవరికీ ఎలాంటి సమస్య రాకుండా అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం చూపాలని ట్వీట్లలో కోరారు.


కాపుల రిజర్వేషన్ల విషయంలో ఆమరణ దీక్షకు ముద్రగడ పద్మనాభం దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ నిర్వహించి ముద్రగడ దీక్షను భగ్నం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తరుపున చర్చలకు వెళ్లేది లేదని, పోలీసులను ఉపయోగించి ఆయన దీక్షను భగ్నం చేయాలని స్పష్టం చేసింది. అదీ కాకుండా, కాపుల రిజర్వేషన్లకు ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ స్పష్టంగా తన మద్దతు తెలియజేయలేదని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాపు మహిళలు కూడా పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లా రేపల్లెలో పవన్ ఫ్లెక్సీ చింపేశారు. ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ కాపుల దీక్షను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి సూచనలు పంపించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement