ఆ జిల్లా అధికారులు అంత యాక్టివ్ కాదు: కేసీఆర్
సంగారెడ్డి: మెదక్ జిల్లా లోని ఎర్రవెల్లి తరహాలోనే కరీంనగర్ లోనూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం త్వరగా చేసి గృహప్రవేశాలు నిర్వహించాలని భావించాం, అయితే ఆ జిల్లా అధికారులు యాక్టివ్ గా లేరంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో మే30వ తేదీ లోపు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం గృహప్రవేశాలు జరుగుతాయని వెల్లడించారు. అదేవిధంగా ఎర్రవెల్లికి గోదావరి జలాలు తెప్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 7న గోదావరి జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ఎర్రవెల్లి లాగే కరీంనగర్ లో డుబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనుకున్నానని, కానీ కరీంనగర్ జిల్లా అధికారులు యాక్టివ్ గా లేరని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అనంతరం ఎర్రవెల్లి నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరారు.