ప్రాణం తీసిన విద్యుత్ సపోర్ట్‌వైరు
Published Sat, Aug 27 2016 11:31 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
జోగిన్‌పెల్లి(కోరుట్ల రూరల్) : మండలంలోని జోగిన్‌పెల్లి గ్రామానికి చెందిన సట్ట జితేందర్ (29) అనే యువరైతు శనివారం విద్యుత్‌షాక్ తగిలి మృతిచెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం జితేందర్ తన మొక్కజొన్న తోటను కోతులబెడద నుంచి కాపాడుకోవటానికి ఉదయం వెళ్లాడు. ఒడ్డుకు చెప్పులు విడిచి విద్యుత్ స్తంభం వద్దకు చేరాడు. అదే స్తంభానికి సపోర్ట్‌కోసం వేసిన తీగను పట్టుకున్నాడు. ఆ తీగకు మధ్యలో ఉండాల్సిన బొక్క తొడుగు లేకపోవటంతో విద్యుత్ సరాఫరా అయ్యింది. దీంతో జితేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో జితేందర్ తండ్రి లచ్చయ్య కొడుకును వెతుక్కుంటూ తోటలోకి వెళ్లాడు. స్తంభం పక్కన ఉన్న పొదలో శవమై కనిపించడంతో బోరున విలపించాడు. జితేందర్ 12 రోజుల క్రితమే గల్ఫ్ నుంచి వచ్చినట్లు తెల్సింది. మృతుడికి భార్య పద్మ, కుమారుడు (4) ఉన్నారు. లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రాజూనాయక్ తెలిపారు.
Advertisement
Advertisement