నేటి నుంచి డివిజన్ కేంద్రాల్లో ‘మీ కోసం’
Published Mon, Jul 3 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా వినతులు స్వీకరించే మీ కోసం(ప్రజాదర్బార్) కార్యక్రమం నేటి నుంచి డివిజన్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెలలో మొదటి సోమవారం నంద్యాలలో నిర్వహిస్తున్నారు. వచ్చే సోమవారం ఆదోని, ఆ తర్వాతి సోమవారం కర్నూలు ఆర్డీఓ కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు సోమవారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అన్ని రకాల సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. 1 గంట నుంచి 2 వరకు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. 3 నుంచి 6 గంటల వరకు అక్కడే మీ కోసం కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై డివిజన్ స్థాయి సదస్సు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం నిమిత్తం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ డివిజన్ కేంద్రాల మీ కోసం కార్యక్రమ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.
Advertisement