టీ హబ్కు సత్యనాదెళ్ల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో ప్రారంభించిన టీహబ్కు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల రానున్నారు. టీ హబ్కు సలహాదారుగా ఉండమని ఇప్పటికే సత్యనాదెళ్లను తెలంగాణ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఐఐఐటీలోని టీహబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలనుద్దేశించి ఆయన ప్రసగించనున్నారు.
ఈ పర్యటనలో ఆయన 3 నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్ లోనే గడపనున్నారు. ఈ నెల 28న టీ హబ్ను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నాన్నారని తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి జయేశ్ రాజన్ తెలిపారు.