
ఆస్పత్రుల ఆధునికీకరణకు సర్వే
జిల్లాలోని 89 ఆస్పత్రులను ఆధునికీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంకే ప్రైవేట్ సంస్థ బృందం ఇంజనీర్లు సర్వే చేపట్టారు.
- జిల్లాలో 89 ఆస్పత్రుల
- భవనాలపై డాక్యుమెంటరీ
- ఎంకే సీనియర్ ఇంజనీర్ విద్యాసాగర్
ఈ డాక్యుమెంటరీ ఎస్‌ఈ దేవేందర్‌కుమార్ సమర్పిస్తామని వెల్లడించారు. ఆయ న ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అలాగే మరో బృందం వైద్యులు ఖాళీలు, సామగ్రి, ఆపరేషన్ పరికరాలు, ఇతర మౌళిక వసతులను కూడా సర్వే చేసేందుకు వస్తోందని చెప్పారు. ఇలా రెండు బృందాలు చేపట్టిన ఆధారాలతో ఆస్పత్రుల రూపురేఖలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చనుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని శిథి లావస్థ భవనాలు తొలగించి నూతన భవనాలు నిర్మించే ఆలోచన చేస్తోందని వెల్లడిం చారు. ఈ రెండు అంశాలపై సమగ్ర సర్వే చేసేందుకు వచ్చినట్లు ఎంకే సంస్థ సీనియర్ ఇంజనీర్ విద్యాసాగర్ తెలిపారు. ఎంకే ప్రిన్సిపల్ కన్సల్‌టెంట్ ఎస్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నామని చెప్పారు.