గ్యాంగ్‌స్టర్ నయీం బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు.
గ్యాంగ్‌స్టర్ నయీం బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఏ రాజకీయ పార్టీ నేతల పేర్లు వెల్లడి కాలేదని.. అవసరాన్ని బట్టి సిట్ బృందంలో మరికొంత మంది అధికారులను చేర్చుకోవచ్చని ఆయన తెలిపారు. నయీం బాధితులు సిట్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చన్నారు. బాధితులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 94406 27218