అమరవీరుల ఆశయసాధనకు కృషి చేయాలి : సీపీఎం
మునగాల: అమరవీరుల ఆశయసాధనకు నేటి యువత కృషిచేయాలని సీపీఎం మండల పార్టీ కార్యదర్శి బుర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు. శనివారం మునగాలలో తెలంగాణ సాయుధ రైతాంగా పోరాట వారోత్సవాలల్లో ఆయన మాట్లాడారు. తొలుత మునగాలలో దాదాపు 200 ద్విచక్రవాహానాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక గణపరవరం క్రాస్‌రోడ్డులో స్టాలిన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మునగాల పరగణా సాక్ష్యంగా నిలిచిందన్నారు. ఆనాటి పోరాటంలో అసువులు బాసిన ఈ ప్రాంత వాసులు కేశబోయిన ముత్తయ్య, అలుగూరి వీరనారాయణ, కొల్లు నందయ్య, గట్టు గోపాలకృష్ణయ్య, సుంకర వెంకయ్య, గుండు రామయ్యల త్యాగాలను శ్రీరాములు కొనియాడారు. వీరి ఆశయ సాధనకు సీపీఎం పార్టీ కార్యకర్తలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ నాయకులు చందా చంద్రయ్య, సొంపంగు జానయ్య, సుంకర పిచ్చయ్య, ఎం.సుందర్‌రావు, ఆరె.రామకృష్ణారెడ్డి, వీర బోయిన వెంకన్న, షేక్ సైదా, షేక్ ఖాజాబీ, జె.కొండారెడ్డి, అనంతు గుర్వయ్య, దేవరం వెంకటరెడ్డి, జి.వెంకటరెడ్డి, బి.రంగయ్య పాల్గొన్నారు.