ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం | poling centres ready to mlc elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం

Published Wed, Feb 22 2017 11:26 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

poling centres ready to mlc elections

– పట్టభద్ర నియోజకవర్గానికి 336 కేంద్రాలు
– ఉపాధ్యాయ నియోజకవర్గానికి 171
– పట్టభద్ర ఓటర్లు 2,49,582 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 20,515

అనంతపురం అర్బన్‌ : పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. మూడు జిల్లాల పరిధిలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు 336, ఉపాధ్యాయ ఎన్నికలకు 171 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి జాబితాను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ బుధవారం విడుదల చేశారు.  

తగ్గిన ఓటర్ల సంఖ్య
    పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాలో అనర్హుల తొలగింపుతో పాటు కొత్తగా నమోదు ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో రెండు నియోజకవర్గాల పరిధిలోనూ ఓటర్ల సంఖ్య తగ్గింది. పట్టభద్ర ఓటర్లు 3,933 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 129 మంది తగ్గారు. తుది జాబితాలో 2,53,515 మంది పట్టభద్ర ఓటర్లు, 20,644 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండేవారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అనర్హుల తొలగింపు, కొత్తగా ఓటర్ల చేర్పు ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియ తర్వాత పట్టభద్ర ఓటర్లు 2,49,582 మంది మిగిలారు. వీరిలో పురుష ఓటర్లు 1,72,962, మహిళా ఓటర్లు 76,611 మంది, ఇతరులు తొమ్మిది మంది ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు 20,515 మంది మిగిలారు. వీరిలో పురుష ఓటర్లు 13,294, మహిళా ఓటర్లు 7,220 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు.

జిల్లాల వారీగా పట్టభద్ర నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాలు  
జిల్లా            మొత్తం    
వైఎస్‌ఆర్‌            105    
అనంతపురం        119    
కర్నూలు            112    
మొత్తం            336    

ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్‌ కేంద్రాలు
జిల్లా        మొత్తం    
వైఎస్‌ఆర్‌        52    
అనంతపురం    65    
కర్నూలు        54    
మొత్తం        171   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement