
నగరానికి ఏమైంది?
ఒకవైపు పొగ..
మరోవైపు కాలుష్యం
తప్పుదు భారీ మూల్యం
అనంతపురం సమీపంలోని గుత్తిరోడ్డు పక్కన ఉన్న డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యార్డు నుంచి వచ్చే పొగ, కాలుష్యం ధాటికి ప్రజలు శ్వాసకోశవ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుత్తి రోడ్డులో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో డ్రైవర్లు పగలు కూడా లైట్లు వేసుకుని వెళ్తున్నారు. అయినా పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న గోడౌన్‌లు, కళ్యాణమండపాలు, పొగ దెబ్బకు మూతపడుతున్నాయి. అధికారులు స్పందించి డంపింగ్ యార్డును మరో ప్రాంతానికి మార్చాలని ప్రజలు వాపోతున్నారు.
- సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం