వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణీ మృతిచెందిన సంఘటన మెదక్ కేర్ ఆస్పత్రిలో ఆదివారం చోటుచేసుకుంది.
మెదక్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణీ మృతిచెందిన సంఘటన మెదక్ కేర్ ఆస్పత్రిలో ఆదివారం చోటుచేసుకుంది. దీంతో ఆమె బంధువులు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. మెదక్ మండలం రాయినిపల్లి గ్రామానికి చెందిన గొల్లసంధ్య(32) రెండో కాన్పు కోసం ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు కేర్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్న వైద్యులు ఉదయం పదిగంటల ప్రాంతంలో బిడ్డ అడ్డం తిరిగిందని తమ వల్ల కాదని.. హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని చెప్పారు.
దీంతో ఆమెను నగరానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. మార్గమధ్యలో నొప్పులు ఎక్కువవడంతో ఓ ఆస్పత్రి చేర్పించి వైద్యం అందించేందుకు ప్రయత్నించేసరికి ఆమె మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.