పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం | sanitation work impartent collector meetiong | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం

Published Mon, Oct 31 2016 9:38 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

sanitation work impartent collector meetiong

  • కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌   
  • అధికారులతో సమీక్ష సమావేశం
  • కాకినాడ సిటీ : 
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నా పారిశుద్ధ్య పనుల అమలులో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడాడుతూ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ కోసం జిల్లాలో 25 మంది జిల్లాస్థాయి అధికారులు నియమించామన్నారు. వారు జిల్లాలో ప్రతి శనివారం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, మరీ ముఖ్యంగా నాల్గవ శనివారం ప్రత్యేక కార్యక్రమాలు ఉండాలన్నారు. ఇప్పటికే మలవిసర్జన లేని గ్రామాలుగా ప్రకటించిన గ్రామాల్లో తదనుగుణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతంచేసి,  జిల్లాలో షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ప్లా¯ŒS ప్రకారం నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలలో రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ మేరకు అటవీ, ఐటీడీఏ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. 
    4 నుంచి డివిజ¯ŒS స్థాయి సమీక్షలు
    వివిధ పనుల ప్రగతిని సమీక్షించేందుకు డివిజ¯ŒS స్థాయి సమావేశాలను ఈనెల 4వ తేదీ నుంచి ఆయా డివిజన్లలో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో డివిజ¯ŒSలోని మండల అధికారులు మండల ప్రగతిని తెలియజేస్తూ వివరించే విధంగా సిద్ధపడి రావాలని కలెక్టర్‌ సూచించారు. 
    గృహ నిర్మాణ పక్షోత్సవాలు
    జిల్లాలో ఎ¯ŒSటీఆర్‌ రూరల్‌ హౌసింగ్, గ్రామీణ పథకాల అమలుకు 1 నుంచి 15 రోజుల పాటు గృహ నిర్మాణ పక్షోత్సవాన్ని నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీనిలో భాగంగా జిల్లాకు మంజూరైన గృహ నిర్మాణాలను ప్రా రంభించడం, లబ్ధిదారులకు మంజూ రు పత్రాలు అందించాలని తెలిపారు.
     
    క్షేత్రస్థాయి నుంచి ఈ–ఆఫీస్‌
    రాష్ట్రంలో డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి నుంచి ఈ–ఆఫీస్‌ విధానాన్ని ప్రవేశపెట్టిలని ప్రభుత్వం నిర్ణయించిందని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఈ సమావేశంలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని మండల, డివిజ¯ŒS స్థాయి అధికారులు సంబంధిత ఫైల్స్‌ను స్కా¯ŒS చేయించడంతో పాటు సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జేసీ–2 రాధాకృష్ణమూర్తి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మూర్తి, ట్రా¯Œ్సకో ఎస్‌ఈ ప్రసాద్, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రాజేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె.పద్మ పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement