మానవ మనుగడ సాధించాలంటే ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు.
మానవ మనుగడ సాధించాలంటే ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు. ఆదివారం దుబ్బాక మండలం కూడవెళ్లి రామలింగేశ్వర ఆలయంలో హరిత హారం కింద మొక్కలను ఎమ్మెల్యే నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నట్లుగా దుబ్బాక నియోజక వర్గ ప్రజలు హరిత హారంలో చురుగ్గా పాల్గొనడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన హరిత హారం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు సామాజిక వర్గాలు పాలు పంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.