స్మార్ట్‌సిటీ డీపీఆర్ ఏజెన్సీ ఎంపిక
-
పనులు దక్కించుకున్న ఐటీఆర్‌ఏ
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకునేందుకు తయారు చేయాల్సిన yì టేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) తయారీకి ఏజెన్సీని ఎంపిక చేశారు. టెండర్ల ప్రక్రియ గురువారం పూర్తికాగా.. తక్కువకు కోడ్ చేసి ఐటీఆర్‌ఏను ఎంపిక చేసినట్లు కమిషనర్ కృష్ణభాస్కర్ తెలిపారు. డీపీఆర్ తయారీకి జాతీయ, అంతర్జాతీయ హోదా గల ఏడు సంస్థలు పోటీపడ్డాయని, నాలుగు టెక్నికల్ బిట్‌లోనే అర్హత కోల్పోయినట్లు తెలిపారు. మిగతా మూడింటికి సంబంధించి ఫైనాన్స్‌బిట్‌ను గురువారం ఓపెన్‌చేయగా.. ఐఐటీఎస్ రూ.55.54లక్షలు, నియా రూ.46 లక్షలు, ఐటీఆర్‌ఏ రూ.28.11 లక్షలు కోడ్ చేశాయి. తక్కువకు కోడ్ చేసిన ఐటీఆర్‌ఏ సంస్థ డీపీఆర్ తయారీ పనులు దక్కించుకుంది. కాగా ఐటీఆర్‌ఏ గతంలో స్మార్ట్‌సిటీ దక్కించుకున్న నగరాలకు పనిచేసినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఒప్పందం పూర్తికానుంది.