సమస్యలు పరిష్కరించకుండా పనులా..? | solve problems | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుండా పనులా..?

Published Tue, Jul 19 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

solve problems

హిరమండలం: వంశధార నిర్వాసితుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా పనులు చేయడం సమంజసం కాదని రాష్ట్ర నిర్వాసితుల సంఘం కార్యదర్శి గంరాపు సింహాచలం హెచ్చరించారు. ఆయన మంగళవారం తులగాం, దుగ్గుపు రం, పాడలి గ్రామాల్లో నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. యూత్‌ ప్యాకేజీ ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని, ఇంత వరకు 3600 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. 950 మంది ఇళ్ల విలువలు ఇవ్వలేదని, మూడు వేల మందికి సొమ్ములు అందలేదని, చాలా మందికి వృత్తి ప్యాకేజీలు, డీ పట్టా భూములకు పరిహారాలు రాలేదని తెలిపారు. తక్షణమే నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆయనతో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోరాడ నారాయణరావు, గండివలస సింహాచలం, గేదెల సింహాచలం, జి.తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement