తిరుపతి : శ్రీవెంకటేశ్వర యూనిర్శిటీలోని విధులు నిర్వర్తిస్తున్న ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎం. నరేంద్రపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతిలోని యూనివర్శిటీలో ప్రొ ఎం నరేంద్ర చాంబర్ను విద్యార్థులు ముట్టడించారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
పీజీ విద్యార్థినులపై ప్రొఫెసర్ నరేంద్ర లైంగిక వేధింపులు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రొ.నరేంద్ర వైఖరిపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థులు నరేంద్ర చాంబర్ను ముట్టడించారు.