విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డీనేటర్ వై. నాగేశ్వర్‌రావు కోరారు.
అంతీపురం(మిర్యాలగూడ రూరల్), విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డీనేటర్ వై. నాగేశ్వర్‌రావు కోరారు. శనివారం మండలంలోని అవంతీపురం గిరిజన బాలుర గురకుల పాఠశాలలో జిల్లా స్థాయిలో నిర్వహించిన విగ్నోసైట్ ఫెస్ట్ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ, మిర్యాలగూడ ,తుంగతుర్తి, దామరచర్ల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చదువుతో పాటు ఆటలు, ఉపన్యాసాలు, క్విజ్, ఆధునిక పరిజ్ఞానం పలు అంశాలు నేర్చుకొని ప్రతిభను కనబరచాలన్నారు.
విజేతలకు బహుమలు పంపిణీ‡ ...
విగ్నోఫెస్ట్‌లో నిర్వహించిన వివిధ పోటీ ల్లో గెలిచిన విద్యార్థులకుS నాగేశ్వర్‌రావు బహుమతుల ప్రదానం చేశారు. వ్యాసరచల న పోటీ(ఈఎం)లో ప్రథమ బహుమతి, ఆర్ విజయ్(మిర్యాలగూడ ), ద్వితీయ ఎల్. స్నేహ(దేవరకొండ), తెలుగు విభాగంలో ఆర్. పవన్(ఎంఎల్‌జీ), ద్వీతీయ స్థానంలో దివ్య(దామరచర్ల) నిలిచారు. ఉపన్యాస పోటీల్లో బి. భరత్(ఎంఎల్‌జీ), శ్రావణి(డీవీకే), ఇష్టాగోష్టీ, క్విజ్ పోటీల్లో ప్రథమ ,ద్వితీయ స్థానాలు మిర్యాలగూడ, దామరచర్ల, స్ఫెల్‌బీలో తుంగతుర్తి విద్యార్థులు ప్రథమ స్థానంలో, మిర్యాలగూడ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కరుణాకర్, అజయ్, వాడపల్లి వెంకటేశ్వర్లు, జైలాని, ప్రకాష్, రాజు,ప్రసాద్, నరేందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.