
అనుమానంతో భార్యపై దాడి
అనుమానంతో తన భర్త గోపాల్‌నాయక్ నిత్యం తనను వేధిస్తున్నాడని, అంతటితో ఆగక దాడి చేసినట్లు చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లి తండాకు చెందిన కృష్ణమ్మబాయి అనే ఆమె పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది.
- ఆస్పత్రిలో చేరిన బాధితురాలు
- రక్షణ కోసం పోలీసులకు ఫిర్యాదు
చెన్నేకొత్తపల్లి(రాప్తాడు) :
అనుమానంతో తన భర్త గోపాల్‌నాయక్ నిత్యం తనను వేధిస్తున్నాడని, అంతటితో ఆగక దాడి చేసినట్లు చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లి తండాకు చెందిన కృష్ణమ్మబాయి అనే ఆమె పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. తమకు పెళ్లై 20 ఏళ్లవుతోందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు ఆమె తెలిపారు.
అయితే కొంతకాలంగా తనను చీటికీ మాటికీ అవమానిస్తున్నాడని, ఆ వంకతో తరచూ గొట్టడం, హింసించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా అతను తనను రక్తగాయాలు కలగకుండా చావబాదినట్లు కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో చెన్నేకొత్తపల్లి పీహెచ్‌సీలో చేరి చికిత్స పొందుతున్నట్లు వివరించారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ పిల్లలను చదివించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అయితే మద్యానికి బానిసైన విచక్షణారహితంగా కొడుతూ, గాయపరుస్తున్నట్లు ఆమె వాపోయింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.