వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం నర్సింహాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయాడు.
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం నర్సింహాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయాడు. నర్సింహాపురం గ్రామస్తులు బుధవారం వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులతో కలసి గ్రామానికి చెందిన యువకుడు సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.