పోస్టాఫీస్‌లకు వాట్సప్‌ నంబర్లు | whatsapp numbers for Post offices | Sakshi
Sakshi News home page

పోస్టాఫీస్‌లకు వాట్సప్‌ నంబర్లు

Published Sun, Sep 18 2016 12:21 AM | Last Updated on Fri, Jul 27 2018 1:22 PM

దేశవ్యాప్తంగా ఉన్న లక్షా 55వేల పోస్టాఫీస్‌లకు వాట్సస్‌ నంబర్లు కేటాయించనున్నట్లు పోస్టల్‌ శాఖ కేంద్ర కార్యదర్శి బీ.వీ.సుధాకర్‌ తెలిపారు. వరంగల్‌ జిల్లా మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సం దర్శించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ ప్రతీ పోస్టాపీస్‌కు వాట్సప్‌ అకౌంట్‌తో కూడిన ఫోన్లు అందిస్తామని తెలిపారు.

మంగపేట(వరంగల్‌) : దేశవ్యాప్తంగా ఉన్న లక్షా 55వేల పోస్టాఫీస్‌లకు వాట్సస్‌ నంబర్లు కేటాయించనున్నట్లు పోస్టల్‌ శాఖ కేంద్ర కార్యదర్శి బీ.వీ.సుధాకర్‌ తెలిపారు. వరంగల్‌ జిల్లా మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సం దర్శించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ ప్రతీ పోస్టాపీస్‌కు వాట్సప్‌ అకౌంట్‌తో కూడిన ఫోన్లు అందిస్తామని తెలిపారు. తద్వారా ఆయా పోస్టాఫీస్‌ల పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడం ప్రజలకు సులువవుతుందని అన్నారు. అలాగే, 19న ఇండియా పోస్టల్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సుధాకర్‌ తెలిపారు.
 
ఈమేరకు ప్రజలు పోస్టల్‌ సమస్యలపై 1924కు ఫిర్యాదు చేస్తే వెంటనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో హన్మకొండ, వరంగల్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లు సత్యనారాయణ, సాయిద్‌ నాయక్, సీపీఎంజి కర్ణల్‌ ఎలీసా, స్థానిక బ్రాంచి పోస్టు మాస్టర్లు శ్రీనివాస్, రమేష్, ఎస్సై మహేందర్‌ పాల్గొన్నారు. తొలుత పోస్టల్‌ శాఖ కేంద్ర కార్యదర్శి బీ.వీ.సుధాకర్‌కు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు కైకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖరశర్మ, పవన్‌ ఆచార్యులు స్వాగతం పలికి  దర్శనం, ప్రత్యేక పూజలు చేయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement