ఓపికను పరీక్షించొద్దు | ysrcp statement on hlc water | Sakshi
Sakshi News home page

ఓపికను పరీక్షించొద్దు

Published Sat, Sep 17 2016 12:50 AM | Last Updated on Fri, Jun 1 2018 9:07 PM

ఓపికను పరీక్షించొద్దు - Sakshi

ఓపికను పరీక్షించొద్దు

– ఈ నెల 20 నుంచి ఆయకట్టుకు నీరివ్వకపోతే చావోరేవో తేల్చుకుంటాం
– హెచ్చెల్సీ ఎస్‌ఈకి మాజీ ఎంపీ అనంత అల్టిమేటం
– రైతులతో కలిసి ఆందోళన


అనంతపురం సెంట్రల్‌ : ‘రెండేళ్లుగా ఆయకట్టుకు నీరివ్వడం లేదు. తుంగభద్ర ఎగువ కాలువ కింద హక్కుదారులుగా ఉన్న రైతులను కాదని ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. మా మంచి తనాన్ని చేతగాని తనంగా భావించొద్దు. ఈనెల 20 నుంచి ఆయకట్టుకు నీరు వదిలితే పొలాల్లోకి పార తీసుకొని వెళతాం. లేకుంటే చావోరేవో తేల్చుకుంటా’మని  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన lకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన  శింగనమల నియోజకవర్గ పార్టీ నేత ఆలూరు సాంబశివారెడ్డి, ఆయకట్టు రైతులతో కలిసి స్థానిక హెచ్చెల్సీ కార్యాలయంలో సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) శేషగిరిరావును కలిశారు.

ఆయకట్టుకు నీరివ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ రైతులు ఎస్‌ఈతో  వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ... ‘గతంలో అనేక కరువులు చూశాం. అప్పట్లో ఎంత కష్టమైనా ఆయకట్టుకు నీరొచ్చాయి. కానీ ఈ ప్రభుత్వంలో రెండేళ్లుగా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హెచ్చెల్సీ పరిధిలో లేకపోయినప్పటికీ కొందరు అధికారబలంతో కళ్లెదుటే అక్రమంగా నీటిని తీసుకెళుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పొలాలకు, వారి పరిసర ప్రాంతాలకు లబ్ధి కలిగేలా వ్యవహరిస్తున్నార’ని మండిపడ్డారు. తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల నుంచి జిల్లాకు నీటిని తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు.

తుంగభద్ర జలాశయం నుంచి 10 టీఎంసీల కే సీ కెనాల్‌ వాటాను మన జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో  కేటాయించారని గుర్తు చేశారు. కానీ మీ అలసత్వంతో ఈ ఏడాది ఇప్పటికే 1.8 టీఎంసీ నీటిని కర్నూలు జిల్లా వారు తీసుకుపోతున్నారన్నారు.  రెండేళ్లుగా గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్, ఎంపీ సౌత్, నార్త్‌కెనాల్, తాడిపత్రి బ్రాం^Œ lకెనాల్‌కు నీరివ్వకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు. ఈ ఏడాది కూడా నీరు విడుదల చేయకపోతే ఈ ప్రాంతంలో పండ్లతోటలు ఏఒక్కటీ మిగలవని హెచ్చరించారు. ఆయకట్టును కాదని చెరువులకు నీరెలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయకట్టు తర్వాత మిగులు జలాలుంటేనే చెరువులకు ఇవ్వాలన్నారు.

తుంగభద్ర నుంచి ప్రస్తుత వాటా 10 టీఎంసీలు, కేసీ కెనాల్‌ వాటా 3 టీఎంసీలు, ఇటు శ్రీశైలం నుంచి ప్రస్తుతం కేటాయించిన 9 టీఎంసీలతో పాటు వీలైనంత ఎక్కువ నీటిని జనవరి నెలాఖరు వరకూ తీసుకొచ్చి హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ కింద సాగైన పంటలను కాపాడడంతో పాటు ఎంపీ సౌత్,నార్త్, తాడిపత్రి బ్రాంచ్‌ కెనాల్‌ తదితర వాటి కింద ఆయకట్టులో ఆరుతడి పంటలకైనా నీరు వదలాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో రెయిన్‌గన్‌ల ద్వారా నాలుగు లక్షల ఎకరాల్లో వేరుశనగను కాపాడినట్లు ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు గొప్పలు చెబుతున్నారని, అలాంటిది హెచ్చెల్సీ కింద 60 వేల ఎకరాల్లో పంటను కాపాడలేరా అని ప్రశ్నించారు.

ఎస్‌ఈ శేషగిరిరావు స్పందిస్తూ కలెక్టర్‌తో చర్చించి ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మెన్‌ జయరామిరెడ్డి, పుట్లూరు,బుక్కరాయసముద్రం సింగిల్‌విండోల అధ్యక్షులు రాఘవరెడ్డి, నాగలింగారెడ్డి, పార్టీ మండల మాజీ  కన్వీనర్‌ బొమ్మలాటపల్లి సుధాకర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌లు నారాయణరెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, నాయకులు ఆకులేడు రామచంద్రారెడ్డి, చెన్నంపల్లి రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ నాయకులు రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement