
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ విజయకుమార్ పరిశీలించారు.
గిద్దలూరు రూరల్, న్యూస్‌లైన్: గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ విజయకుమార్ పరిశీలించారు. పట్టణంలోని సెయింట్ పాల్స్ బీఈడీ కళాశాల ఆవరణలో పోలింగ్ అధికారులకు ఈవీఎంల పంపిణీ కార్యక్రమాలను ఆయన పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ అందాయాలేదా అన్న విషయాల గురించి ఆర్వో సత్యంను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఆయన వెంట తహ సీల్దార్ సుధాకర్‌రావు, ఇతర అధికారులు ఉన్నారు.