అంతా సిద్ధం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి | all arrangements are completed for elections counting | Sakshi
Sakshi News home page

అంతా సిద్ధం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

Published Sat, May 10 2014 3:07 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

అంతా సిద్ధం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి - Sakshi

అంతా సిద్ధం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

 నల్లగొండ, న్యూస్‌లైన్: వరుస ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు 12న, ప్రాదేశికం 13న, సార్వత్రిక ఫలితాలు 16వ తేదీన వెలువరించేందుకు అంతా రెడీ అయ్యింది. మున్సిపల్ ఓట్లను జిల్లా కేంద్రంలో లెక్కిస్తుండగా, సార్వత్రిక కౌంటింగ్‌ను నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండలలో చేపట్టనున్నారు. ఇక, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపును నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపునకు నియమించిన సిబ్బందితో పాటు అభ్యర్థులకు కూడా కౌంటింగ్‌లో పాటించాల్సిన నియమాలపై శిక్షణనిచ్చారు. సార్వత్రిక ఓట్ల లెక్కింపుపై  శుక్రవారం అభ్యర్థులు, ఏజెంట్లకు సమావేశం నిర్వహించారు.
 
 మున్సిపాలిటీ

 జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీలకు 12న నల్లగొండలోని డాన్‌బోస్కో పాఠ శాలలో ఓట్లు లెక్కిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. లెక్కింపునకు మొత్తం 37టేబుళ్లు ఏర్పాటు చేశారు. 148మంది సిబ్బందిని కేటాయించి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్లు లెక్కిసారు. వీటి ఫలితాలు మధ్యాహ్నం 12గంటల వరకు వెలువడే అవకాశం ఉంది.
 
 ప్రాదేశికం...
 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరిగాయి. తొలివిడత ఏప్రిల్ 6న సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్‌ల పరిధిలోని మండలాల్లో నిర్వహించారు. రెండో విడత 11న నల్లగొండ, భువనగిరి డివిజన్లలో ఎన్నికలు జరి గాయి. ఈ ఎన్నికల్లో 86.41శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 835ఎంపీటీసీ స్థానాలకు 3,311 మంది అభ్యర్థులు పోటీచేశారు. 59జెడ్పీటీసీ స్థానాలకు 392మంది పోటీ చేశారు. 13న ఈ ఓట్ల లెక్కింపునకు 2వేల మంది సిబ్బందిని నియమించారు. వారికి శిక్షణ ఇచ్చారు. అలాగే 483 టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతి టేబుల్‌కు మూడు రౌండ్ల లెక్కింపు చేస్తారు. జిల్లాలో అధికంగా చౌటుప్పల్ మండలానికి 12టేబుళ్లు కేటాయిం చారు. యాదగిరిగుట్ట, వలిగొండ, భువనగిరి, బీబీనగర్ మండలాలకు 10టేబుళ్లు, చిన్న మండలాలకు 6నుంచి 8టేబుళ్లు కేటాయించారు.

ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. బాక్సుల్లోనుంచి తీసిన ఓట్లనుంచి జెడ్పీటీసీకి కేటాయించిన తెల్లరంగు బ్యాలెట్, ఎంపీటీసీకి కేటాయించిన గులా బీ రంగు బ్యాలెట్‌లను వేరు చేస్తారు. వాటిని ఆయా గుర్తులతో ముందుగానే సిద్ధం చేసిన ట్రేల ల్లో వేస్తారు. ఎంపీటీసీ స్థానం లెక్కింపు మూడు రౌండ్లుగా జరుగుతుంది. ఒక్కో రౌండ్‌కు సుమా రు వెయ్యి ఓట్లను లెక్కపెడతారు. మధ్యాహ్నం 3 గంటవరకు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. జెడ్పీటీసీల లెక్కింపు రాత్రి వరకు పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 25 ఓట్లను ఒక కట్టగా కట్టి ఓట్లను లెక్కపెడతారు.
 
 సార్వత్రిక కౌంటింగ్ రెండుచోట్ల..
 సార్వత్రిక ఎన్నిక ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 161, స్వతంత్రులు 67మంది పోటీ చేశారు. చిన్నా చితకా కలిపి 19పార్టీలు బరిలో నిలిచాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి 15మంది అభ్యర్థులకు తగ్గకుండా పోటీ చేయగా, మునుగోడు, కోదాడ నియోజకవర్గాల్లో మాత్రం 17మంది చొప్పున పోటీ చేశారు. సార్వత్రిక ఓట్ల లెక్కింపు నల్లగొండ పట్టణంలోని రెండు కేంద్రా ల్లో జరుగుతుంది. నల్లగొండ పార్లమెంట్ సెగ్మెం ట్ పరిధిలోని 7నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు గొల్లగూడలోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లో, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 5నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు దుప్పల పల్లి సమీపంలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో నిర్వహించనున్నారు. 16వ తేదీ (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుంది.

దీని నిర్వహణకు ఒక్కో నియోజక వర్గానికి 24 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు 12, ఎంపీ అభ్యర్థులకు 12టేబుళ్లు ఉంటాయి. కౌంటింగ్‌లో ఈవీఎంలు తెరవడానికి ముందు జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో పోస్టల్ బ్యాలె ట్ ఓట్లను లెక్కిస్తారు. ఈ లెక్కింపు 6వ టేబుల్‌పై జరుగుతుంది.  తర్వాత ఈవీఎం లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ మీద బ్యాలెట్ పత్రాల గణన జరుగుతుండగానే పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చిన ఓటింగ్ యంత్రాల కంట్రోల్ యూనిట్లను లెక్కిం పు టేబుళ్లకు పంపిణీ చేస్తారు.  ప్రతి టేబుల్ వద్ద ఒక పోలింగ్ స్టేషన్‌లో పోలైన ఓట్లు  లెక్కింపు ఒకే సారి చేపట్టడం జరగుతుంది. లెక్కింపు టేబుళ్లను బట్టి అన్ని పోలింగ్ స్టేషన్ల ఓట్ల లెక్కింపు ఏక కాలంలో మొదటి రౌండ్ లెక్కింపుగా చేపడతారు. ఈ విధంగా 18నుంచి 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఓట్ల లెక్క పూర్తిచేసి ఫలితాలు వెల్లడిస్తారు. దీనికి సంబంధించిన మాక్ కౌంటింగ్‌ను 15వ తేదీన నిర్వహిస్తారు.
 
 లెక్కింపు కేంద్రంలోకి ఇవి నిషేధం..
 కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించే అభ్యర్థులు, ఏజెం ట్లు తమతో పాటు పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, కెమెరాలు, సిగరెట్లు, గుట్కాలు, పాన్‌లు, ఇతర మత్తు పదార్థాలు, సెల్‌ఫోన్‌లు తీసుకురావడాన్ని నిషేధించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement