
అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్
జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన 19 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పలమనేరు సమీపంలోని మదర్‌థెరిసా కళాశాలలో మంగళవారం ఉదయం నుంచి అర్దరాత్రి వరకు కొనసాగింది.
- పలమనేరులో ఆలస్యంగా ప్రారంభం
- భోజనాల కోసం అధికారులు, అభ్యర్థుల పాట్లు
- పోలీసుల లాఠీచార్జి
పలమనేరు/ పలమనేరు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన 19 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పలమనేరు సమీపంలోని మదర్‌థెరిసా కళాశాలలో మంగళవారం ఉద యం నుంచి అర్దరాత్రి వరకు కొనసాగింది. 400 మందికి పైగా సిబ్బంది కౌంటింగ్ ప్రక్రి య చేపట్టారు. పలమనేరు, కుప్పం, పుంగనూరు, పీలేరు, చంద్రగిరి నియోజకవర్గాలకు చెందిన 284 ఎంపీటీసీ స్థానాలకు, 19 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ జరిగింది.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనా బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కట్టడం చాలా ఆలస్యమైంది. మధ్యాహ్నం 2 గంటలైనా పలు మండలాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో మంగళవారం అర్దరాత్రి వరకు కౌంటిం గ్ కొనసాగింది. దానికి తోడు పలు కేంద్రాల్లో అధికారుల మధ్య సమన్వయం లోపించడం తో మరింత ఆలస్యమైంది. కొన్నిచోట్ల అభ్యర్థులు, వారి ఏజెంట్లు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడం కూడా ఆలస్యానికి కారణమైంది. మొదటి రౌండ్‌లో గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలు ఇవ్వడంలోనూ ఆలస్యం జరిగింది. ఫలితంగా మంగళవారం అర్దరాత్రి వరకు అధికారులు, అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
భోజనాల కోసం అధికారులు, అభ్యర్థుల పాట్లు
అధికారులు, ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు వారి ఏజెంట్లు భోజనాల కోసం తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. సకాలంలో భోజనాలందక కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. వాహనం లో భోజనాలు రాగానే ఆహార ప్యాకెట్లను పొందేందుకు ఒక్కసారిగా జనం వెళ్లడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు.
పోలీసుల లాఠీచార్జి
కౌంటింగ్ కేంద్రం ఎదుట వేలాది మంది హం గామా చేశారు. మంగళవారం సాయంత్రం ఫలితాలు వెలువడగానే జన సందోహం మరింత పెరిగింది. పోలీసులు అదుపు చేయలేని విధంగా పరిస్థితి మారింది. ఈ తరుణం లో పలు మండలాలకు చెందిన వారు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ విజయోత్సవాల కు దిగారు. ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగి లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా రెచ్చిపోయిన జనం పోలీసుల పైకి రాళ్లు రు వ్వారు. దీంతో పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డి, సీఐలు బాలయ్య, రామక్రిష్ణ రంగ ప్రవే శం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ రత్న
కౌంటింగ్ కేంద్రాలను జిల్లా అడిషనల్ ఎస్పీ రత్న పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతిం చాలని సిబ్బందికి సూచించారు.