
తెలంగాణలో సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా విడుదల
తెలంగాణలో సీపీఎం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో సీపీఎం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 3 లోక్సభ, 5 శాసనసభ స్థానాలకు సిపిఎం అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ ఖమ్మం స్థానానికి సమీనా, నల్లగొండ స్థానానికి నంద్యాల నరసింహారెడ్డి, భువనగిరి స్థానానికి చెరుపల్లి సీతారాములు పోటీ చేస్తారు.
శాసనసభకు మధిర స్థానానికి లింగల కమల్‌రాజు, పాలేరు - పోతినేని సుదర్శన్, భద్రాచలం- సున్నం రాజయ్య, ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య, మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి పేర్లను ప్రకటించారు.