సీపీఎం తొలి జాబితా విడుదల | CPM releases first list | Sakshi
Sakshi News home page

సీపీఎం తొలి జాబితా విడుదల

Published Thu, Mar 27 2014 2:17 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

CPM releases first list

3 లోక్‌సభ, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

 

 సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం విడుదల చేసింది. మూడు పార్లమెంటు స్థానాలు, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ నేత చెరుపల్లి సీతారాములు బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఈ జాబితాను విడుదల చేశారు. తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం భావిస్తోందని, తొలి జాబితాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామని తమ్మినేని చెప్పారు. నామినేషన్లకు వారం వ్యవధి మాత్రమే ఉన్నందున పొత్తులు, చర్చల పేరిట మరింత జాప్యం చేయకూడదనే ఉద్దేశంతోనే మొదటి జాబితాను విడుదల చేస్తున్నామన్నారు. పొత్తులు కొలిక్కి రాకపోతే వారం రోజుల్లో మిగతా అభ్యర్థులనూ ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో పొత్తుకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని అన్నారు. ఒక వేళ కలిసొచ్చే పార్టీలతో పొత్తు కుదిరితే ఇప్పుడు ప్రకటించిన జాబితాలో కూడా సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పొత్తుల కోసం మీడియా ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నామని, ఎదుటి పార్టీల నుంచి కనీస స్పందన కూడా రావడంలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నందువల్ల పార్టీ సంప్రదాయం ప్రకారం ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని తమ్మినేని చెప్పారు. తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివద్ధి, ఉపాధి కల్పన కమ్యూనిస్టులతోనే సాధ్యమైందన్న విషయాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ గుర్తించాలని అన్నారు.

 

 సీపీఎం అభ్యర్థుల జాబితా ఇదీ..

 పార్లమెంటు స్థానం   అభ్యర్థి పేరు

 ఖమ్మం         అఫ్రోజ్ సమీనా ఎండీ

 నల్లగొండ నంద్యాల నర్సింహారెడ్డి

 భువనగిరి చెరుపల్లి సీతారాములు

 అసెంబ్లీ స్థానాలు

 భద్రాచలం      సున్నం రాజయ్య

 మధిర          లింగాల కమల్‌రాజ్

 పాలేరు         పోతినేని సుదర్శనరావు

 మిర్యాలగూడ   జూలకంటి రంగారెడ్డి

 ఇబ్రహీంపట్నం పగడాల యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement