
'మూడో కూటమికి కాంగ్రెస్ మద్దతు వద్దు'
హైదరాబాద్: మూడో కూటమికి బయట నుంచి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తిరస్కరించారు. నరేంద్ర మోడీని అడ్డుకునేందుకు తృతీయ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదన తాజాగా తెరపైకి రావడంతో ఆయన స్పందించారు.
అతి పెద్ద పార్టీయే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాలన్న అభిప్రాయాన్ని దిగ్విజయ్ వ్యక్తం చేశారు. డామినెంట్ పొలిటికల్ పార్టీ అయితేనే సంకీర్ణ ప్రభుత్వాన్ని సజావుగా నడపగలుతుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అవసరమయితే థర్డ్ ఫ్రంట్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు పృద్ధిరాజ్ చౌహాన్, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేష్ ప్రతిపాదించిన నేపథ్యంలో దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.