భన్వర్‌లాల్
హైదరాబాద్: రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలలో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం(ఇసి) రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. గ్రామాల్లో ఈవీఎం నమూనాలను ప్రదర్శించి, ఓటర్లకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వద్దన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్కు అవకాశం లేదని చెప్పారు. ఈవీఎంలోని నోటా ఆప్షన్‌పై ఓటర్లకు అవగాహన కల్పిస్తామన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1800 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆధారాలు చూపకుండా తరలిస్తున్న 100 కోట్ల రూపాయలను పట్టుకున్నట్లు తెలిపారు. మూడున్నర లక్షల లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీలో రాష్ట్రం అగ్రస్థానానికి చేరిందన్నారు. ఓటర్లు డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు లోను కావొద్దని భన్వర్ లాల్ కోరారు.