కుంకలమర్రు (కారంచేడు) న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదు సంతకాలు చేయబోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన మండలంలోని కుంకలమర్రులో పర్యటించారు. కారంచేడు జెడ్పీటీసీ అభ్యర్థిని దగ్గుబాటి నాగజ్యోతి, కుంకలమర్రు ఎంపీటీసీ అభ్యర్థిని జువ్వా కోమలరాణిలకు ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రాష్ట్ర ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పిల్లల్ని బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బులు వేసేలా ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకంపై మొదటి సంతకం చేస్తారన్నారు. అవ్వా తాతలకు 200 నుండి 700 పింఛను పెంచుతూ రెండవ సంతకం, రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు 3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ మూడో సంతకం పెడతారన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తూ నాలుగోసంతకం, ఏ గ్రామానికి వెళ్లినా అడిగిన వెంటనే అన్ని రకాల కార్డులు మంజూరు చేసేలా ఐదో సంతకం చేసి కొత్త చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. పేద ప్రజల కోసం చేసిన వాగ్దానాలు నెరవేర్చగల నాయకుని రాజ్యం కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని ప్రజల హర్షాతిరేకాల మధ్య భరత్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఖాళీ..
మండలంలోని కుంకలమర్రులో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది. మంగళవారం రాత్రి భరత్ సమక్షంలో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వా శ్రీనివాసరావు, అనిశెట్టి మస్తానరావు, గ్రామ సర్పంచ్ కూరాకుల వజ్రమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యులు తెలగతోటి స్వాతి, కే నాగేశ్వరమ్మ, గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భరత్ రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
భరత్‌కు అడుగడుగునా నీరాజనం
గొట్టిపాటి భరత్‌కు కుంకలమర్రులో అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. గ్రామ దేవతలు పోలేరమ్మ, తిరుపతమ్మల దేవాలయాల్లో భరత్ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఎద్దుల బండిపై జెడ్పీటీసీ అభ్యర్థిని దగ్గుబాటి నాగజ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థిని జువ్వా కోమలరాణి గ్రామంలోని బీసీ కాలనీ, పుట్టాయిపాలెం, ఎస్సీ కాలనీ, మెయిన్‌రోడ్డుల గుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి వీధిలోను భరత్‌కు మహిళలు హారతులు పట్టారు. పూలవర్షం కురిపించారు. అనంతరం మెయిన్ రోడ్డులోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూరాకుల వజ్రమ్మ, జువ్వా శ్రీనివాసరావు, అనిశెట్టి మస్తాన్‌రావు, యార్లగడ్డ పాపారావు, భానుప్రకాష్, యార్లగడ్డ సుబ్బారావు, దగ్గుబాటి రామకృష్ణ, సుమంత్, కోటయ్య, వేలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం కోసమే జగనన్న ఐదు సంతకాలు
Published Wed, Apr 2 2014 3:23 AM | Last Updated on Mon, May 28 2018 1:41 PM
Advertisement
Advertisement