ఉమ్మేసిన వారికే ఓటేస్తారా?: కిరణ్ | kiran kumar reddy road show in chittor district | Sakshi
Sakshi News home page

ఉమ్మేసిన వారికే ఓటేస్తారా?: కిరణ్

Published Sat, Apr 12 2014 4:40 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

ఉమ్మేసిన వారికే ఓటేస్తారా?: కిరణ్ - Sakshi

ఉమ్మేసిన వారికే ఓటేస్తారా?: కిరణ్

పలమనేరు/తిరుపతి, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలను విడగొట్టి అవమానపరిచి ఉమ్మేసిన వారికే ఓట్లు వేస్తారా అని జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పలుచోట్ల రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుప్రజల దయాదాక్షిణ్యాలతో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందన్నారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఓటుతో బుద్దిచెప్పాలని ఆయన కోరారు.  
 
 పీలేరు నుంచే కిరణ్ పోటీ!: మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే ఈ ఎన్నికల్లోనూ  పోటీ చేయనున్నారు. ఈనెల 17వ తేదీన నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. పీలేరు నుంచి ఆయన సోదరుడు కిషోర్‌కుమార్ రెడ్డిని నిలిపి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి కిరణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.  . శుక్రవారం పీలేరు నియోజకవర్గంలోని మండలాల వారీగా ముఖ్యులతో సమావేశమై తాను పీలేరు నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement