ముస్లిం ఓట్లు కీలకం | Muslims votes is main key role in Telangana state | Sakshi
Sakshi News home page

ముస్లిం ఓట్లు కీలకం

Published Fri, Mar 28 2014 1:44 AM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

ముస్లిం ఓట్లు కీలకం - Sakshi

ముస్లిం ఓట్లు కీలకం

ముహ్మద్ మంజూర్: తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం ఓటర్లది కీలక పాత్ర. తెలంగాణలోని మొత్తం పది జిల్లాల్లోనూ ముస్లింల జనాభా చెప్పుకోదగ్గ స్థారుులో ఉంది. హైదరాబాద్ నగరంలోని చార్మినార్, యూకుత్‌పురా వంటి కొన్ని నియోజకవర్గాల్లోనైతే  ముస్లింల జనాభా 40 శాతానికి పైమాటే. ఏ రాజకీయ పార్టీ ఇక్కడ ముస్లింలను విస్మరించి లేదు. అందువల్ల అన్ని పార్టీలూ ముస్లింలను ఆకట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారుు. తెలంగాణలోని పది జిల్లాల్లోనూ ముస్లింలపై ధార్మిక సంస్థల ప్రభావం చాలా ఎక్కువ. గతంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు హయాంలో బీజేపీకి టీడీపీ మద్దతు పలకడాన్ని ఇక్కడి ముస్లిం సంస్థలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి.  
 
 బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదివరకు బీజేపీకి మద్దతు పలికిన టీడీపీ కూడా ఇక్కడి ముస్లింల విశ్వాసం కోల్పోరుుంది . హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, చార్మినార్, యాకుత్‌పురా, మలక్‌పేట్, నాంపల్లి, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 శాతానికి పైగానే ఉండగా, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో 20-25 శాతం వరకూ ఉంది. జిల్లాలవారీగా చూస్తే, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, వాటిలో 4-5 స్థానాల్లో ముస్లిం ఓట్లే అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 17-20 స్థానాల్లోనూ అదే పరిస్థితి.
 
 ముస్లింలకు అన్ని విధాలా అండగా ఉంటా..
 వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన అన్ని మైనార్టీ పథకాలను నూతనంగా ఏర్పడబోయే రాష్ట్రంలో కూడా కొనసాగిస్తాం. వైఎస్సార్ ప్రభుత్వంలో కొనసాగిన పథకాలు ముస్లిం రిజర్వేషన్, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్, మాస్ మ్యారేజెస్, ఉర్దూ భాషాభివృద్ధి, ఉర్దూ మీడియం స్కూళ్లలో వసతులు, ఉర్దూ టీచర్ల నియమాకం, పవిత్ర  హజ్ యాత్రలో సబ్సిడీ, వక్ఫ్ భూముల పరిరక్షణ చట్టం తదితర వాటిని అమలు చేస్తాం. ముస్లింల కోసం ప్రస్తుతమున్న బడ్జెట్‌ను పెంచి కేటాయించిన బడ్జెట్ నిధులను ముస్లింలకు అందేలా పర్యవేక్షిస్తాను.
 
 ముస్లిం రిజర్వేషన్‌ను కొనసాగిస్తాం. వీలైతే దీని శాతాన్ని పెంచడానికి కృషి చేస్తాం. ముస్లిం మైనార్టీలకు విద్యారంగంలో ప్రోత్సాహం కల్పించి, ముస్లిం అమ్మాయిలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు సైకిళ్లు, యూనిఫామ్‌లను అందిస్తాం. మైనార్టీలకు ఉపాధి కల్పనలో ప్రోత్సాహం కల్పిస్తాం. మధ్యలో మానేసిన ముస్లిం విద్యార్థుల కోసం వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం. ముస్లిం అమ్మాయిలకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం. ఉర్దూ అకాడమీకి మరిన్ని నిధులను పెంచుతాం. మసీదుల నిర్మాణం, మరమ్మతుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. ప్రభుత్వంలోని ప్రతి సంక్షేమ పథకాల్లో ముస్లిం జనాభా ప్రతిపాదికన వాటా కల్పిస్తాం. ముస్లిం పేద అమ్మాయిల వివాహం కోసం వారి తల్లిదండ్రులు బెంగపడాల్సిన అవసరం లేదు. ఒక అన్నయ్యలా వారి నిఖా సందర్భంగా 50 వేల రూపాయలను కానుకగా అందించి అర్థికంగా అదుకుంటా.
 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
 రాజన్నది రైతురాజ్యం

 దేశానికి పట్టెడన్నం పెట్టే రైతుల కష్టాలను కళ్లారా చూసిన రాజన్నతోనే రైతు రాజ్యం వచ్చింది. కరెంట్ బిల్లులు, రుణాల మాఫీ, వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు దివంగత  ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పుణ్యమే. ఆయన 2009లో పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత రుణమాఫీ, ఉచిత కరెంట్ ఫైలుపై తొలి సంతకం చేయడంతోనే నా అప్పులు తీరిపోయి, కష్టాలు దూరమయ్యాయి. మా ఊరి శివారులో ఉన్న 21 ఎకరాల భూమిని, రెండు బోరు మోటార్ల ద్వారా సాగు చేసుకుంటున్నాను. రాజన్న కాలలో రూ. 90 వేలు విద్యుత్ బకాయిలు, రూ. 80 వేల బ్యాంకు రుణం మాఫీ అయ్యింది. 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇవ్వడంతో ప్రతి పంటకు రూ. 2.80 లక్షల దిగుబడులు సాధించాను. ప్రస్తుతం కరెంట్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు, కరెంట్ లేకున్నా కష్టమర్‌చార్జీల పేరిట రైతులను బాదుతున్నారు. నాలుగు శాతం రిజర్వేషన్ లతో ముస్లింలకు ఎంతో మేలు జరిగింది..
 - ఎండీ ఖాలిక్, కోమలంచ గ్రామం,
 నిజాంసాగర్ మండలం, నిజామాబాద్ జిల్లా

 
 మహానేత చలవతోనే ఎంబీబీఎస్ చదివా
 మాది నిరుపేద కుటుంబం. మా నాన్న ఎండీ యూసుఫ్ సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. నాతో పాటు నాతోడ పుట్టిన మరో ఇద్దరినీ చదివించేవారు. మునుగోడులోని సెయింట్ ఆంధోని పాఠశాలలో 7వ తరగతి వరకు, 8 నుంచి 10వ తరగతి వరకు గూడపూర్ శాంతినికేతన్‌లో చదివించారు. ఇంటర్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చదివించారు. 2005లో ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. అదే సమయంలో మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. నేను డాక్డర్ కావాలన్న కల నెరవేరదని నిరాశ చెందా. అదే ఏడాది దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించారు. దాంతో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివా.  ప్రస్తుతం పీజీ చేసేందుకు పరీక్ష రాశా.
- డాక్టర్ ఎండీ ఫారూఖ్, మునుగోడు (నల్లగొండ)
 
  కల సాకారం చేసిన.. రిజర్వేషన్
 నా పేరు ముహమ్మద్ ఫుర్ఖాన్ ఆమేర్. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ లో తృతీయ సంవత్సరం చదువుతున్న. మాది హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు చెందిన నిరుపేద కుటుంబం. నాన్న ఎండి.ఉస్మాన్‌షరీఫ్. హైదరాబాద్‌లో చిరు వ్యాపారి. చిన్నప్పటి నుంచి నేను చదువుల్లో ప్రతిభ చూపేవాడిని. నన్ను డాక్టర్ చేయాలని తల్లిదండ్రులు కలలు కనేవారు. కానీ ఆర్థిక స్థోమత లేదు. అయితే 4 శాతం రిజర్వేషన్‌తో మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. వైఎస్ చలువతో నాకే కాదు.. నాలాంటి ఎంతో మంది కలలు సాకారం చేసుకున్నారు.        

 - ముహమ్మద్ ఫుర్ఖాన్, కరీంనగర్
 
 ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆదుకుంది
 నిరుపేద కుటుంబం కావడంతో ఎలాగోలా పాఠశాల విద్యను పూర్తి చేసిన నాకు కళాశాల విద్య కష్టతరమైంది. ఉన్నత చదువులు ఇక కలే అనుకున్నా. అయితే 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అండగా నిలిచింది. ఈ పథకం సహకారంతో హైదరాబాద్‌లోని ఫ్రీస్టోన్ పీజీ కాలేజీలో ఎంబీఏలో చేరాను.  అయితే ఇప్పటి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదు. దీంతో నాకు మళ్లీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి..
 - ఫిరోజ్‌పాషా, ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్
 
 పదో తరగతి కూడా పూర్తి చేస్తాననుకోలేదు..
 మా ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. మా నాన్న చిన్నపాటి తోపుడు బండి వ్యాపారం చేసేవారు. నేను పదో తరగతి కూడా చదువుతాననే నమ్మకం ఉండేది కాదు. అయితే డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా నేను ఈ రోజు బీటెక్ పూర్తి చేసుకొని ఒక ప్రైవేటు కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం నాకు ప్రతి నెల రూ. 35 వేల నుంచి రూ.40 వేల వేతనం ఉంది. నేడు ఈ స్థాయికి ఎదగానికి కారణమైన మహానేతను ఎన్నడూ మరువలేను. ముస్లిం యువత అండగా ఉండాలని కోరుకుంటున్నాను.             
 - ఫకృద్దీన్, ఎస్.ఆర్.నగర్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement