బీజేపీలో మోడీ మేనియా విపరీతంగా పెరిగిపోతోంది. పార్టీ కన్నా మోడీనే ఎక్కువ అనే స్థాయికి చేరింది. తాజాగా అది మరింత పెరిగి మోడీని ఏమైనా అంటే దేశ బహిష్కరణే అనేంత స్థాయికి చేరింది.
బీజేపీలో మోడీ మేనియా విపరీతంగా పెరిగిపోతోంది. పార్టీ కన్నా మోడీనే ఎక్కువ అనే స్థాయికి చేరింది. తాజాగా అది మరింత పెరిగి మోడీని ఏమైనా అంటే దేశ బహిష్కరణే అనేంత స్థాయికి చేరింది. జార్ఖండ్‌లో ఒక ఎన్నికల సభలో శనివారం బీహార్‌కు చెందిన బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మోడీని వ్యతిరేకించేవారికి ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తరువాత దేశంలో స్థానం లేదంటూ తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. ‘మోడీ ప్రధానమంత్రి కాకుండా ఆపాలనుకునేవారికి పాకిస్థానే గతి. వారికి ఇండియాలో స్థానం లేదు. వారంతా పాకిస్థాన్‌కు వెళ్లాల్సిందే’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలను బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సమక్షంలోనే చేయడం గమనార్హం.