పితాని ఎదురీత
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మొన్నటివరకూ రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన వ్యక్తిగా చక్రం తిప్పిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఈ ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి మద్దతు లేకపోవడం.. స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ నుంచి జై సమైక్యాంధ్ర పార్టీకి.. తరువాత తెలుగుదేశం పార్టీకి మారడంతో జనంలో చులకనయ్యారు. మరోవైపు ఐదేళ్లపాటు మంత్రిగా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా సొంత లాభం కోసమే పనిచేయడం ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. దీంతో తాజా ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్షగా మారాయి. రాష్ట్రం విడిపోతున్నా లెక్కచేయకుండా మంత్రి పదవిలో కొనసాగిన పితాని రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంట నడిచిన విషయం తెలిసిందే. కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి కొద్దిరోజుల కీలకంగా వ్యవహరిం చారు. ఆ పార్టీకి ఆదరణ లేదని తేల డంతో వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఆయన పదవి కోసం ఎన్ని పార్టీలైనా మారతారని.. ఏమైనా చేస్తారనే విమర్శలు వెల్లువెత్తాయి. అధికారం ఎక్కడుంటే అక్కడ అతుక్కుపో యే ఆయన నైజంపై తొలినుంచీ నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
అందని టీడీపీ నేతల సహకారం
టీడీపీలో చేరిన పితానికి ఆ పార్టీ నేతలు మనస్ఫూర్తిగా సహకరించ డం లేదు. దీంతో ఆయన అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఇంతకాలం తమను తిట్టి, వేధించిన వ్యక్తి కోసం ఎలా పనిచేస్తామని ప్రతి గ్రామంలో ప్రశ్నిస్తున్నారు. తనకు ఇవ్వాల్సిన సీటును ధనబలం ఉన్న పితానికి ఇవ్వడంతో అప్పటివరకూ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరించిన గుబ్బల తమ్మయ్య పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది పితా నిని కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటివరకూ బీసీల ఓట్లు తనకే అని ఆయన భావించినా.. తమ్మయ్య దెబ్బకు ఆ నమ్మకం పోయింది. మరోవైపు ఏ గ్రామంలోనూ టీడీపీ నేతలు ఆయన్ను దరికి చేరనీయడంలేదు. ఆచంట వేమవరంలో పితాని కోసం పనిచేసేది లేదని ఆయన ఎదు టే చెప్పిన గ్రామస్తులు, టీడీపీ నేతలు ఆయనను అక్కడినుంచి వెనక్కి పంపించారు. చాలా గ్రామాల్లో మంత్రి అనుచరులు టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న నేతలను మొన్నటివరకూ ఇబ్బందులకు గురిచేశారు. దీంతో పితా ని అనుచరులు, టీడీపీ నేతల మధ్య పొసగడం లేదు. పితాని తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ తమపై పెత్త నం చేసేందుకు వారిని రంగంలోకి దిం పుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల టీడీపీ నేతలు తప్పక ఆయన వెనుక మొక్కుబడిగా నడుస్తున్నా ఎన్నికల్లో మాత్రం వ్యతిరేకంగానే పనిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అధికారంలో ఉన్నా చేసింది సున్నా
మరోవైపు ఐదేళ్లు మంత్రి పదవిలో ఉన్న పితాని నియోజకవర్గాన్ని ఏవి ధంగా అభివృద్ధి చేయలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాం ఘిక సంక్షేమంతోపాటు ఆర్ అండ్ బీ శాఖకు మంత్రిగా ఉన్నా ప్రజలు చెప్పుకునే స్థారుులో ఒక్క పనికూడా ఆయన చేసిన పాపానపోలేదు. మంత్రిగా ఉన్న సమయంలో సొంత లాభం కోసమే ఆయన పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. గోదావరి ఇసుక ర్యాంపులు ఆయనకు కామధేనువుగా మారాయనే విమర్శలున్నాయి. ఆ ర్యాంపుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు టీడీపీ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. డెల్టా ఆధునికీకరణ పనులకు సంబంధించిన కాంట్రాక్టుల్లోనూ పర్సంటేజీలు తీసుకుని ఇష్టానుసారం వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. పనులు జరక్కపోయినా కాంట్రాక్టర్లను ఏమీ అనకుండా వదిలేసి అధికారులను బాధ్యుల్ని చేసి పితాని చేతులు దులిపేసుకునేవారు. ఇవన్నీ ఆయన ని జస్వరూపాన్ని బయటపెడుతున్నాయి. అధికారం ఉన్నప్పుడు అత్యంత బల వంతునిగా కనిపించిన పితాని అది కాస్తాపోయి టీడీపీలో చేరిన తర్వాత అత్యంత బలహీనంగా కనిపిస్తున్నారు. అందుకే ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన సరిగా తిరగడం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. సహాయ నిరాకరణ చేస్తున్న క్యాడర్‌ను బతిమాలుకోవడానికి, పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను బుజ్జగించడానికే ఆయన సమయం సరిపోతోంది.