
బాబు, మోడీల దోస్తీ చారిత్రక తప్పిదం
రేణిగుంట, న్యూస్‌లైన్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జత కట్టడం చారిత్రక తప్పిదమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో గురువారం నిర్వహించిన సీపీఎం ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గతంలో బీజేపీ దుష్మన్ (శత్రువు) పార్టీ అని, మతతత్వ పార్టీ అధికారంలోకి వస్తే దేశం భగ్గుమంటుందని అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీతోనే జత కట్టడం నీతిమాలిన చర్య అని విమర్శించారు. గతంలో తిరుపతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరమణను భూకబ్జాకోరు అని దూషించి ఇప్పుడు ఆయన్నే టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపి దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని విరుచుకుపడ్డారు.